పురాణం - భాగం 2 || పురాణం యొక్క లక్ష్యం ఏమిటి?

పురాణం - భాగం 2 || పురాణం యొక్క లక్ష్యం ఏమిటి?

పురాణం - భాగం 2

పురాణం యొక్క లక్ష్యం ఏమిటి?


• రామాయణ భారతాది కావ్యేతిహాసాల లాగా పురాణాలలో ఒకే మౌలిక కధాసూత్రం ఉండదు. బహువిధ విషయాలతో నిండి ఉంటాయి. వేద పురాణ కావ్యాలను వరుసగా ప్రభుసమ్మితాలు, మిత్ర నమ్మితాలు, కా౦తానమ్మితాలు అంటారు. వేదాలు ప్రభువులాగా శాసిస్తాయని, పురాణాలు మిత్రుని లాగా బోధిస్తాయని, 
కావ్యాలు ప్రియురాలిలాగా రంజి౦పచేస్తూ ఉపదేశిస్తాయని భావం. అందువల్ల పురాణాలలో కధ ప్రదానం. కధ ద్వారా నీతిని భోదించడం జరుగుతుంది. కావ్యంలో రసం ముఖ్యం.


• సంస్క్రుతపురాణాలైనా, కావ్యేతిహాసాలైనా తెలుగు కవుల చేతుల్లో సౌ౦దర్యవిషయంలో కావ్య లక్షణాన్నే సంతరించుకున్నాయి. సంస్కృతంలో అష్టాదశ పురాణాలూ, అష్టాదశ ఉపపురాణాలూ ఉంటే తెలుగులో వాటిలో కొన్ని కావ్యరూపంలో అనువాదితమయ్యాయి. కొన్నిటిలోని కధలు ఆధారంగా కవులు 
కావ్యాలు రచించారు.


• సమాజం వ్యక్తుల మధ్య సంబంధాల మీద, వ్యక్తుల నడవడిమీద ఆధారపడి నడుస్తుంది. పురాణ వాజ్మయం వ్యక్తి నడవడిని, సమాజంలో వర్గాల, వ్యక్తుల సంభందాలను నిర్దేశి౦చడానికి, ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తుంది. విభిన్న సామాజిక వర్గాల మధ్య సంబంధాలు, సమాజంలోని వ్యక్తుల మధ్య అంటే, రాజు-ప్రజలు, భార్యాభర్తలు, తల్లితండ్రులు-పిల్లలు, గురుశిష్యులు, బంధుమిత్రులు సంభంధాలెలా ఉండాలో, వాటి ఆదర్శమేమిటో కదారూపంలో నిర్వచించడం పురాణ లక్ష్యం.