పురాణం - భాగం 1 || పురాణంలో ఏముంది?

పురాణం - భాగం 1 || పురాణంలో ఏముంది?

#పురాణం #వేదం #ఋషివర్య

పురాణం - భాగం 1

 

పురాణంలో ఏముంది?


• సంస్కృతంలో విస్తారమైన సాహిత్యం ఉంది. ఈ సాహిత్యాన్ని వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం అని రెండు విధాలుగా విభజిస్తారు. వేదాలు, వాటికి సంబందించిన సాహిత్యం అంతా వైదిక సాహిత్యం. తక్కినది లౌకిక సాహిత్యం.

• మనం నాలుగని చెప్పుకుంటున్న వేదాలు అనంతం. వాటిని వర్గీకరించి కూర్చినవాడు వేదవ్యాసుడు. ఈ వ్యాసుడే అష్టాదశ పురాణాలను రచించారు. ఆయన పేరిట గొప్ప సాహిత్యం ఉంది. వ్యాసుడను సాక్షాత్తు "శ్రీమన్నారాయణుడు" అని భావిస్తారు.

• వేదాలు స్వరప్రదానమయిన మంత్రాలతో కూడుకుని ఉంటాయి. వాటి సారాన్ని కధలరూపములో సరళంగా శ్రోతలకు అందించేవే పురాణాలు.

• పురాణం పంచలక్షణాలతో కూడుకున్నది. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అన్నవి ఆ అయిదు లక్షణాలు. సృష్టి, ప్రళయం, దేవదానవ యుద్దాలు, రాజవంశాల చరిత్ర, మన్వంతరాలలో జరిగిన విషయాలు పురాణంలో ఉంటాయి. బహువిషయాలతో కూడుకొని ఉన్న పురాణాలు ఒక విధంగా ప్రాచీన విజ్ఞాన సర్వస్వాలవంటివి. ఈ పురాణాలను సాత్వికాలు, రాజసికాలు, తామసికాలు అని కూడా విభాగం చేస్తారు.