"ధర్మం"

"ధర్మం"

#ఋషివర్య #ధర్మం #జీవన_విజ్ఞానం #Rushivarya

మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీర్తనమూ" అంటారు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు. ధర్మం ఎవరు నిర్వర్తి౦చాలీ? ఒక్క మనుష్యునికే ధర్మం. ఆ ధర్మం నిరంతరమూ మారిపోతూ ఉంటంది. మిగిల్న వాటికన్నిటికీ ఒకటే ధర్మం. తిర్యక్కులకు అంటే ప్రత్యేకించి పశువులకూ, పక్షులకూ అన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు.

|| పశుధర్మ నమో ప్రీతం || అంటారు దేవీభాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ధర్మం ఒక్కటే. ఆకలేస్తే టి, దాహమేస్తే తాగడం, కామం కలిగితే సంభోగించడం, నిద్రవస్తే పడుకోవడం, కోపమొస్తే కుమ్మడం. అంతే వాటి ధర్మం. అంతేతప్పా వాటికి ఇతరవిధాలైన ధర్మం లేదు. ఇతరవిధాలైన ధర్మం అంటే.. ఏ ధర్మాన్ని అనుష్ఠానించిన కారణంచేత ఇంక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరంలేని స్దితిని పొందుతాడో, అటవంటి ధర్మాచరణం చెయ్యవలసిన స్దితి కానీ, అధికారం కానీ, ఇతరప్రాణులకు కలిగించబడలేదు. ధర్మానుష్ఠానమంతా ఎవరి కొరకు అంటే కేవలం మనుష్యుని కొరకు.

మళ్ళీ ఈ భూలోకానికంతటికీ కూడా ధర్మాచరణం కానీ, కర్మాచరణం కానీ, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహంచడం కానీ, అధికారం ఎక్కడ్ననిదీ అంటే ఒక్క భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే. వేదం స్పష్టంగా ఆ మాటలు చెప్పింది. ఇక్కడ మాత్రమే కర్మానుష్ఠానం, యజ్ఞయ్గాది క్రతువులు జరుగుతాయి తప్పా ఇతరమైన ప్రదేశాల యందు భూమండలంలో ఈ క్రతువులు చెయయాడానికి యోగయామైన ప్రదేశాలు లేవు.