నాసదీయసూక్తం - 7 మంత్రములు!

నాసదీయసూక్తం - 7 మంత్రములు!

నాసదీయసూక్తం - 7 మంత్రములు!

♦ 1వ మంత్రం:
► || నసదాసీన్నో సదాసీత్ తదానీం ||


సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు. ఆదిలో మనకి అవగతమయే విశ్వం లేదు. అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. (అంటే, ఏదో ఉందనే భావం)
••••••••

శాస్త్రవేత్తల పరిశోదన ప్రకారం ఇప్పటికి కేవలం 5% విశ్వం గురించి తెలుసుకున్నారు కాని ఇప్పటికీ కొన్నిట్ల గురించి తెలుసుకోలేకపోతున్నారు... 
విశ్వం గురించి తెలుసుకునంతవరకు MATTER అంటారు.... దానికి అవతల ఉన్నదాన్ని DARK MATTER అంటారు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు... కాని ఏదో ఉందని మాత్రం అంటున్నారు.

విశ్వస్వరూపం అంటూ "ఋగ్ వేదం"లో ఉన్న నసదియ సూక్తం మనకి ఏనాడో తెలియజేసింది.

••••••••


♦ 2వ మంత్రం:
► || న మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా ||


మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. “ఇది” తప్ప మరింకేమీ లేదు! ఆ "ఇది" ఏమయ్యుంటుంది అనే ప్రశ్న లేవదీస్తుంది ఈ సూక్తం!!

♦ 3వ మంత్రం
► || తమ ఆసీత్ తమసా గుళమగ్రే ||


అవగాహనకి అందని ఆ “ఇది” మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అంతా చీకటితో ఆవృతమైన చిట్టచీకటి. ఆ “ఇది” ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం. (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తాపం వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది.

♦ 4వ మంత్రం
► || కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేత ||


ఆ ఆదిలో కోరిక జనించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. ఇచ్ఛ వల్ల విశ్వం వికసించింది. (వికసించి, వ్యాప్తి చెందింది)

♦ 5వ మంత్రం
► || రేతోధ ఆసన్ మహిమాన ఆసన్ త్స్వ ||


బీజం అలా నాటటంతో మహా శక్తులు నాలుగు దిశలలో ఉద్భవించేయి

♦ 6వ మంత్రం
► || కో అద్ధ వేద క ఇహ ప్రవోచత్ | కుత అజాతా కుత ఇయాం విసృష్టిః ||


ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? దేవగణాలకి కూడా
పుట్టుకకు తరువాతే ఈ ఉనికి సిద్ధించింది.
••••••••

వేమన చరిత్ర చిత్రంలో ఒక విషయం గురించి ప్రస్తావన వస్తుంది.. ఈశ్వరుడు ఒక వృద్దుని రూపంలో వచ్చి ఇలా అంటారు. దేవతలకు కూడా తెలియని సృష్టి రహస్యం మానవుడవు, నీకెలా తెలుస్తుంది అని!
ఈ సన్నివేశం ఇక్కడ చూడవచ్చు http://bit.do/fF4i4

••••••••

♦ 7వ మంత్రం
► || యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ | త్సో అఙ్గ వేద యది వా న వేద ||


ఈ సృష్టికి కారణ భూతమైన కారణం ఉందో లేదో తెలియదు. ఈ సృష్టికార్యం అనే ప్రహేళికకి పరిష్కారం ఉందో, లేదో! ఆ సృష్టికర్తకే తెలియాలి. బహుశా వాడికి కూడా తెలియదేమో. 
──────────────────────────────
ఇంత నిగూఢ రహస్యాలను మన ఋషులు ఎంత చక్కగా చెప్పిఉన్నారో... చాలా అద్భుతం! అదీ మన "ఋషులు" మరియు మన సనాతన ధర్మం యొక్క విశిష్టత గొప్పతనం!