మాత్రుదినోత్సవం

మాత్రుదినోత్సవం

#ఋషివర్య #మాత్రుదినోత్సవం

కనిపించే దైవమే "అమ్మ"! మనం కంటితో ప్రపంచాన్ని చూస్తున్నాం అంటే ఆమె వలనే..
మనకు జన్మనిచ్చి, నడక నేర్పి, మాటలు నేర్పి, మనిషిగా తీర్చిదిద్దే ఆమెకి మన సంస్కృతి ప్రకారం మూడు సార్లు ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. అలా చేస్తే "భూమిని మూడు సార్లు, సప్త నదులలో స్నానం" చేసిన ఫలితాన్ని పొందుతారు.
(నేనైతే ప్రతీ రోజు ప్రదిక్షణ చేసుకుంటాను)


|| ఆయుహు పుమాన యశః స్వర్గ కీర్తి పుణ్యం భలం శ్రీయం 
పశు సుఖం ధనం ప్రాన్ప్రుయాన్మాత్రు వందనం ||
 అంటారు...

అంటే..
ఎవరైతే అమ్మని ఒక దేవతలా పూజిస్తూ సేవ చేసుకుంటారో, వారికి విజయం, స్వర్గం, పేరు, ధనం, ఆహారం, పశువుకి ఉండే సుఖం లభిస్తుంది.

లోకంలో ఒక మాట ఉంటుంది. ఎవరి ఋణం అయినా తీర్చుకోవచ్చు. ఆకరికి నాన్న ఋణం కూడా. కానీ తీర్చుకోలేని. ఋణం ఉందీ అంటే అది ఒక్క అమ్మదే! ఆమె ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది.

‘‘అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం...’’

అందుకే || మాత్రు దేవో భవ || ????

పేజీని అనుసరించే మాత్రుమూర్తులందరికీ "ఋషివర్య" తరపున "మాత్రు దినోత్సవ" శుభాకాంక్షలు