ఇలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి...

ఇలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి...

#ఋషివర్య #జీవన_విజ్ఞానం

స్నేహము అంటే ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం. అది జీవితాన్ని ఉద్దరించాలే తప్ప పాడుచేయకూడదు. అందుకే మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి.. ఎలాంటి వారితో స్నేహం చేస్తే మీ జీవితం ఉద్ధరిస్తుందో, ఎవరితో సన్నిహితంగా ఉంటే జ్ఞానం పొందుతారో, ఎవరితో స్నేహం చేయడం వలన అటువంటి జ్ఞానము చేత మీ వంశము ధర్మమార్గం వైపుగా వెళుతుందో, అటువంటివారితో స్నేహం చేయాలే తప్పా.. వెరెక్కి తిరిగే వారితో స్నేహం చేసి వ్యసనాల బారినపడి మీ జీవితాన్ని మీ చేతులతో త్రుంచేసుకునే పరిస్థితికి తీసుకురాకూడదు.

మహాకవి కాళిదాస అంటారు.. || సతాం సబ్డిహిసంగః కదమపి హి పుణ్యేన భవతి ||
అంటే.. మంచివారితో స్నేహం చేయడమనేది గత జన్మల పుణ్యం చేత మాత్రమే జరుగుతుంది అని..

అందుకే జ్ఞానం కలిగిన వారితో, జ్ఞానాన్ని పొందుతున్న వారితో, ధర్మ మార్గంలో వెళ్తున్న వారితో, ఆధ్యాత్మిక మనసు కలిగిన వారితో స్నేహం చేయాలి. అటువంటి వారి స్నేహాన్ని లేదా అటువంటి కుటుంబ సభ్యులని తిరస్కరించేవారిని అంటే వద్దు అనుకునేవారిని "నీచులు" అనే కర్మఫలం పొందుతారు. గుర్తుంచుకోండి.. భారతంలో అర్జునుడు "తత్సంసగీచపంచమహా" అని ప్రతిజ్ఞ చేసాడు. అంటే "వాళ్లు చేసేది చెడుపని అని తెలిసి కూడా స్నేహం చేసారంటే, వారి స్నేహం వలన జీవితం బ్రష్టత్వం పొందుతుందని తెలిసి కూడా వారితో సన్నిహితంగా  ఉంటే తమ జీవితం పతనం అయిపోయి వారి పాప కర్మలలో సగం వీరి ఖాతాలోకి వచ్చునుగాక" అని అర్ధం. అందుకే ఆ ప్రతిజ్ఞ జోలికి మనం వెళ్ళకూడదు. మంచివారితో మాత్రమే స్నేహము చేయాలి, వేదమును ప్రమాణముగా స్వీకరించి బ్రతకాలి, జీవితాన్ని ధర్మబద్ధం చేసుకోవాలి !