తన కోపమే తన శత్రువు

తన కోపమే తన శత్రువు

#ఋషివర్య #క్రోధం #జీవన_విజ్ఞానం 

|| తన కోపమె తన శత్రువు ||

► షడ్గుణాలలో ఒకటైనది క్రోధం. అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు.

► దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి, మరియు చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
► అందుకే భగవదీతలో శ్రీకృష్ణలవారు.


ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే ।।
 (2- 62)
అంటారు...

అంటే..
ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారం పెరుగుతుంది. మమకారం కోరికలను కలుగ చేస్తుంది, ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.

"ఎవరికైనా ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు మరియు భోగ వస్తువులు వచ్చినా అతని కోరిక చల్లారదు. కాబట్టి, దుఃఖానికి మూల కారణం అదే అని తెలుసుకొని, తెలివైన వ్యక్తి తన కోరికలను త్యజించాలి."
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

► క్రోధానికి ఫలితం ఎన్నటికీ తీరని అసంతృప్తి. క్రోధాత్ములు అశాంతీయులు. కోపధారులు తమ చుట్టూ ఉన్నవారి జీవితాలలోను అశాంతినే నింపుతారు. కోపాన్ని జయించడం ప్రేమతోనే సాధ్యం. సత్యప్రేమికులు ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. రజో గుణాన్ని పెంచే కోపం వలన మహామహులు సైతం పశ్చాత్తాప పడవలసి వచ్చింది. రాగద్వేషాలకు అతీతంగా ప్రేమించడం నేర్చుకున్నవారికే క్రోధం దూరమై ఆనందం సొంతమవుతుంది.