ఓ ఆత్మ యోక్క శోకం

ఓ ఆత్మ యోక్క శోకం

#ఋషివర్య #జీవన_విజ్ఞానం

జీవితం ఎంత విలువయినదో తెలియదలుచుకుంటే ఇది చదవండి. యుక్త వయసువారు చదవడం ఇ౦కా ఉత్తమం!
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

► ఉదయం 6 గంటల సమయం. ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాని లేవలేకపోతున్నాను..
ఎందుకో ఏమిటో మరి......
" ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ?" ఒక్క నిమిషం ఆలోచించాను.
నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొట్టినంత నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.

► కాఫీ కావాలి! కానీ నా భార్య ఎక్కడ ఉంది? ఎందుకు నన్ను లేపలేదు. ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?

వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు. ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......
అయ్యో అది నేనే! దేవుడా...! నేను చనిపోయానా?

► బయట చాలా మంది ఏడుస్తున్నారు. బిగ్గరగా
పిలిచాను.. నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి
నా పక్కగదిలోకి తొంగి చూశాను.... నా భార్య విపరీతంగా ఏడుస్తోంది కొడుకును పట్టుకుని. భార్యను పిలిచాను. తనకు నా మాటలు
వినిపించలేదు. మరో గదిలోకి వెళ్ళి చూశాను. ఆ గదిలో మా అమ్మ నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు దుఖంలో.

► " నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను. ఎవ్వరూ నన్ను చూడటం లేదు. బయటికి పరుగెత్తి వచ్చాను. అక్కడ నా ప్రాణ స్నేహితుడు భయంకరంగా
ఏడుస్తున్నాడు. వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.
నా స్నేహితునితో నాకు గొడవ వచ్చి వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడ్టం మానేశాను. ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు. మరి వాడెందుకు ఏడుస్తున్నాడు.. అవును నేను చనిపోయాను. నిజంగానే చనిపోయాను.

► 'దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని ఇవ్వు. ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను. నువ్వు చాలా అందంగా ఉన్నావనీ, నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం అని చెప్పలేకపోయాను. నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను. నేను వచ్చేలోగానే నా బిడ్డ నిద్రపోయేవాడు. ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను
చూడలేకపోతున్నాను. చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను." అని బిగ్గరగా ఏడుస్తున్నాను.

► " దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు. నా తల్లి
మొహంలో నవ్వును చూడాలి. నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు
ప్రాణబిక్ష పెట్టు స్వామీ! "
ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు. కళ్ళు తెరిచి చూశాను. నా భార్య " ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. ఏమైంది మీకు ?" అని అడుగుతోంది.
అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట. నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నా భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి " నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం. నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా ఉన్నావో తెలుసా ? " అన్నాను.
ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య.

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
మిత్రులారా! మీకు ఇంకా చాలా సమయం ఉంది. మీ ఈగోలను
పక్కనపెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి. అన్నీ పోగొట్టుకున్న తరువాత బాధపడి ఏమీ లాభం లేదు. కుటుంబంతో గడపండి, స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి. ఈ జన్మ దేవుడిచ్చినది. ఆనందంగా జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!

ఇంత ఓపిగా చదివిన మీకు ధన్యవాదములు.. ఇతరులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి!