ఉపనిషత్ అంటే ఏమిటి?

ఉపనిషత్ అంటే ఏమిటి?

#ఋషివర్య #ఉపనిషత్తులు #జీవనవిజ్ఞానం

ఉపనిషత్ అంటే ఏమిటి?

• మానవులకు మోక్షమార్గాన్ని చూపేవే ఉపనిషత్తులు.
ఇవి వేదాలకు చివరలో ఉండటం వల్ల వేదాంతాలు అని పేరువచ్చింది.

• నాలుగు వేదాలలో 1,180 ఉపనిషత్తులు ఉన్నాయని చెబుతారు. అయితే కేవలం 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇందులోనూ పది ఉపనిషత్తులు అంత్యంత ముఖ్యమైనవి.

• అవే ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక. ఉపనిషత అర్థాన్ని గమనిస్తే... ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట.. మొత్తంగా కలిసి ఉపనిషత అంటే సమీపంగా కింద కూర్చునుట అని అర్థం.

• అంటే శిష్యులు వేదాంత జ్ఞానాన్ని గురువుకు సమీపంగా కింద కూర్చుని తెలుసుకోవాలి. సమీపంగా అంటే గురువుకు దగ్గరగా అని కాదు. గురుబోధనకు దగ్గరగా అని. కింద కూర్చోవడం అంటే శారీరకంగా కింద కూర్చోవడం అని కాదు. గురువు ఉన్నతుడనే భావనతో ఉండటం. అప్పుడే గురువు నుంచి పెల్లుబికే జ్ఞాన గంగ అజ్ఞానంలో ఉన్న శిష్యులను చేరుతుంది.