భగవంతుడు రహస్యంగా ఉంటాడు!

భగవంతుడు రహస్యంగా ఉంటాడు!

మీరు మీలోనే ఉన్నారు, మీరు ఆత్మ రూపంలో ఉన్నారు, విశ్వం ఆత్మ రూపంలో మీలోనే ఉంది, ఆత్మ మీలోనే ఉంది కనుక విశ్వం మీలోనే ఉంది. అది కదులుతుంది కనుక ఆత్మ కూడా కదులుతుంది, దానికి కదలికలు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కనుకనే అది కదులుతుంది, మీరు కూడా కదులుతున్నారు... మిమ్మల్ని మీరు చూసున్నారు అంటే వాడు కనపడాలి... వాడే పరమాత్ముడు!!

భగవంతుడు పరమ రహస్యంగా ఉంటాడు. ఆయనకి అలా ఉండడమే ఇష్టం. యదార్ధానికి దొరకని ఆయనని మనం కూడా అంతే రహస్యంగా అతడిని కనుగొనాలి. అంతటి రహస్యంగా ఉండేవాడి రహస్యాలని కూడా వెల్లడించేవి సనాతన వేద, పురాణాలు!!

~ ఋషివర్య